మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై కేటీఆర్ రియాక్షన్..!

-

మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ లలో పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అలాంటి ఆలోచన ఏమీ లేదని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలులోకి వస్తుందని బోర్డులు దర్శనమిస్తున్నాయి అని KTR అన్నారు.

అయితే మెట్రో ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ చర్యలు మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అని తెలిపారు. ఇక ఈ చర్యలు చూస్తుంటే మెట్రోను మరింత ప్రోత్సహించే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే సంగతిని.. ఇక ఈ ప్రభుత్వం పట్టించుకోదని స్పష్టంగా అర్థం అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయితే అందుకోసం మెట్రో ప్రయాణికులకు జరిమానా విధిస్తూ వారిని నిరుత్సాహపరచడం ఎందుకు అని ప్రశ్నించారు. అయితే దీనిపై సమాధానాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు KTR.

Read more RELATED
Recommended to you

Exit mobile version