మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన కేటీఆర్

-

ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై పలువురు మహిళలు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ నోటీసులు పంపించింది. తాజాగా మహిళా కమిషన్ నోటీసులపై స్పందించారు కేటీఆర్. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు.

మెయిల్ ద్వారా నోటీసులు అందాయి. మహిళలకు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా తనక నోటీసులు పంపించారు. కావాలనే తనకు నోటీసులు పంపించారని పేర్కొన్నారు.  బుధవారం ఉదయం 11 గంటలకు హాజరవుతానని తెలిపారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన దాడుల గురించి కూడా మహిళా కమిషన్ ప్రస్తావిస్తానని చెప్పారు. అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళా కమిషన్ నోటీసులు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు కేటీఆర్.  మరోవైపు తాను ఏబీవీపీ నుంచి వచ్చానని..  చనిపోయే సమయానికి బీజేపీలో ఉంటానని రేవంత్ రెడ్డి మోడీకి చెప్పినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి టచ్ లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ పై పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తామని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version