ఇంట్లో ఈ మార్పులు చేస్తే.. ధన ప్రవాహం పెరుగుతుంది..!

-

ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని.. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో ఈ మార్పులు చేయండి. ధనం ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. అప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది. ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. సాయంత్రం పూట ప్రధాన ద్వారం దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. చాలా మంది అందుకే ఇలా చేస్తుంటారు.

అలాగే వాస్తు ప్రకారం కొబ్బరికాయను పెడితే లక్ష్మీదేవి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుందట. కాబట్టి మొలకెత్తిన కొబ్బరికాయని ఇంట్లో పెట్టడానికి చూడండి. ధన ప్రవాహం పెరగాలంటే ఇంట్లో లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుని విగ్రహాలు ఉంచాలి. నిత్యం పూజిస్తూ ఉండాలి. ఆర్థిక సమస్యలు అప్పుడు రాకుండా ఉంటాయి. ఎంతో సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లని ఆవు విగ్రహాలని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇలా ఈ మార్పులు మీ ఇంట్లో చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే ఆర్థిక బాధలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా బలపడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇంట్లో చెత్తాచెదారం వంటివి ఉండటం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా అందంగా ఉండాలి. ప్రధాన ద్వారం దగ్గర పాత సామాన్లు వంటివి ఉండకూడదు. ఇలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version