ప్రముఖులను న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరిస్తున్న చీటర్ అరెస్ట్..!

-

ప్రముఖులను న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరిస్తున్న చీటర్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసింది రిధి బేడి. అమెరికాలో ఆరేళ్లపాటు మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసే వచ్చిన రిధి బెడి.. డబ్బులు సులువుగా సంపాదించాలని న్యూడ్ వీడియో కాల్ చేసి బెదిరిస్తోంది. దుబాయ్ లో సెటిల్ అయిన ఇండియన్స్ ని టార్గెట్గా చేసుకొని వసూలు చేస్తుంది.

అమ్మాయి గొంతుతో ముందుగా వీఐపీలని ట్రాప్ చేస్తున్న రిధి బెడి.. తీయటి మాటలతో VIP లను బుట్టలో వేసుకొని న్యూడ్ కాల్స్ చేయించుకుంటుంది రిధి బేడి. ఆ న్యూడ్ వీడియో కాల్స్ ని స్క్రీన్ రికార్డ్ చేసి బెదిరిస్తున్న రీది బేడి.. సోషల్ మీడియాలో పెడతాను అంటూ.. అలా చేయకుండా ఉండాలి అంటే లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుంది. దుబాయ్ తో పాటు ఇండియాలో ప్రముఖులు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన రీది బేడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version