మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు?

-

మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు? అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన పోస్ట్‌ పెట్టారు. మూసి వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అంటూ నిలదీశారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? అని ఆగ్రహించారు కేటీఆర్‌.

ktr on revanth over computer

మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అని నిలదీశారు. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? అంటూ ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అంటూ ఆగ్రహించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news