కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. విశ్వాసం లేని వ్యక్తి….రంజిత్ రెడ్డి కాదు.. రన్నింగ్ రెడ్డి !

-

కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. ఆయన విశ్వాసం లేని వ్యక్తి…. రంజిత్ రెడ్డి కాదు.. రన్నింగ్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి పడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల లిస్ట్ చూడండి.. మొత్తం మన పార్టీ నుంచి పోయినవాళ్లేనని..మోడీ హవా ఉంటే పక్కా పార్టీల నుంచి కాళ్లు పట్టుకొని ఎందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

ktr

కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి వాళ్లిద్దరూ ఎవరో తెలియకపోయినా సరే మీరు గెలిపిస్తే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహించారు. విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడు…మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్‌ను ఓడిపోయేలా చేసిందని ఫైర్ అయ్యారు. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు… యాక్టింగ్‌కు ఆస్కార్ ఇస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి ఇయ్యాలే అంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news