మేం తప్పు చేస్తే, చీల్చి చెండాడండి – మీడియాకు KTR సూచనలు

-

మేం తప్పు చేస్తే, చీల్చి చెండాడండని మీడియాకు ఐటీ శాఖ మంత్రి KTR సూచనలు చేశారు. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రెసెంట్ ఫ్యూచర్ అంశం పై రెండు రోజుల జాతీయ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. సిటీలో వర్షం వచ్చినప్పుడు వార్తలు చూస్తే మొత్తం మునిగినట్టు అనిపిస్తుందని..వార్తలు చూస్తే ఇప్పుడు ఏది వార్త… ఏది వాస్తవం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ఈ దేశం లో మీడియా మోడియాగా మారిపోయింది. 8 ఏళ్లుగా మన్ కి బాత్ తప్ప…మీడియా తో మాట్లాడిన సందర్భ ఉందా అని ప్రశ్నించారు. జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ ఇక్కడ తయారుఅవుతుంది,ఐటీ లో మంచి కంపెనీలు హైద్రాబాద్ లో ఉన్నాయి..ఇది వార్త కదా… మన విషయం మనం చెప్పుకుంటే తప్పేంటన్నారు. మేము తప్పు చేస్తే చీల్చి చెండా డండి…ఎప్పుడు ఐటీ,ed దాడుల వార్తలేనా అని ప్రశ్నించారు.

మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదని… అనితర సాధ్యమైన ఇంజనీరింగ్ ఫీట్ చేస్తే ఎందుకు చూపించడం లేదని పేర్కొన్నారు. మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు తెగడం లేదు…ఇది వార్త కాదు…కానీ కట్ట తెగిటే వార్త.. పాల, చేపల ఉత్పత్తి లో ముందు లో ఉన్నాం..ఇవన్నీ వార్తలు కావా? అన్ని రంగాల్లో ఉన్న పాజిటివ్ వార్తలను ఎందుకు చూపించారని మీడియాను ప్రశ్నించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version