బిగ్ బాస్ లో ఇనాయ మరో కౌశల్ గా మారనుందా..!!

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో రోజుకో ట్విస్టు తో ఎవ్వరు ఊహించని విధంగా సాగుతున్న ఈ సీజన్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్కు ఎంతో ఉత్కంఠ నడుమసాగింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడారు..ఈ క్రమంలో  కొట్లాటలు, గోల గోల , ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు. మంచి సీరియల్ కు సరిపడా కథ ఉండేలా మలుపులు తిరుగుతూ టాస్క్ పూర్తి అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ టాస్కులో విజేతగా నిలిచి ఫైమా ఇంటి కెప్టెన్ అయ్యింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో మంచి రెబల్ గా పేరు తెచ్చుకున్న ఇనయ లీలలు మామూలు గా లేవు.తాను బిగ్ బాస్ లో ఎక్కువ మంది రెబల్ గా విన్ అయిన వారే వున్నారనే రీజన్ తో ఆమె ఎగ్రేసివ్ బిహేవియర్ తో వుంటుంది. ఎందుకంటే అప్పట్లో కౌశల్ కూడా ఇలాగే అందరితో గొడవలు పెట్టుకుంటూ ఎక్ నిరంజన్ గా ఉండి ఎంత గోల పెట్టినా విన్ అయ్యాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ వస్తోంది.

కాక పోతే ఇనాయ కారెక్టర్ డిఫరెంట్ గా ఉంది.వాస్తవానికి ఆమె ఇంటి కెప్టెన్ అయ్యే ముందు పైమా తో పెద్ద గొడవ పెట్టుకుంది.. అప్పుడు ఆమె ఒక రేంజ్ లో రెచ్చి పోయింది. ఇక పైమా కూడా ఏ మాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ గా నిలబడింది.కానీ ఎప్పుడైతే ఫైమా ఇంటి కెప్టెన్ అయ్యిందో ఇనాయ కంగ్రాట్స్ అని నవ్వుతు చెప్పడం తో ఫైమా ఎమోషన్ అయ్యి ఇనాయని కౌగిలించుకుని ఏడ్చింది. ఇది చూసి మిగిలిన వారికి షాక్ తిన్నంత పని అయ్యింది. ఇక ముందు ముందు ఎన్ని విచిత్రాలు జరుగుతాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version