బిఆర్ఎస్ కార్యనిర్వాక, అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్లకు రానున్నారు. కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెశవరావుతో కలిసి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని జిల్లా పార్టీ నాయకులు కోరారు.
ఇది ఇలా ఉండగా నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. తనకు చంద్రబాబు, నారా లోకేష్ బాగా దగ్గరవారని… అలాగే పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సినవారు అని తెలిపారు. అయితే హైదరాబాదులో ఉన్న సెటిలర్స్, చంద్రబాబు మద్దతుదారులు మెట్రో రైల్లో నిరసన తెలపడం చాలా తప్పు అని వెల్లడించారు. నిరసన తెలిపాలంటే ధర్నా చౌక్ ఉందని… అక్కడ తమ నిరసనను ఎంతసేపైనా తెలుపుకోవచ్చని వివరించారు మంత్రి కేటీఆర్.