కేసీఆర్‌ తో మాట్లాడి..రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం – కేటీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ తో మాట్లాడి..రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుకు చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. సిరిసిల్ల పట్టణం సాయి మణికంఠ పంక్షన్ హాల్ లో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కెటిఆర్. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రతి కులంలో డబ్బున్నవారు, డబ్బులేని వారు ఉన్నారని.. పేదవారు ఏ కులంలో ఉన్నవారైనా, వారికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

కులం, మతం లో గూర్చి నాకు తెలియదని.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతమని చెప్పారు. రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆ కుటుంబానికి ధీమా నిచ్చేవిధంగా 5 లక్షల భీమా వస్తుందని… రాజన్న సిరిసిల్ల జిల్లా లో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి, ముస్సోరి లో ఐఏఎస్ లకు పాఠ్యాంశంగా చేర్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వైశ్య ,రెడ్డి కులాల కార్పోరేషన్ విషయం తీసుకెళ్ళి ఏర్పాటుకు కృషి చేస్తానని.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version