బీసీబంధు లబ్ధిదారుని ఆటోలో ప్రయాణించారు కేటీఆర్. సిరిసిల్ల పర్యటనలో భాగంగా దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి గత ప్రభుత్వంలో బీసీ బంధు పథకం ద్వారా ఆటో కొన్నానని తెలిపారు.. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు.
ఇక నిన్న దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులను పరామర్శించారు కేటీఆర్. 18 ఏండ్లు దుబాయ్ జైలులో మగ్గి తిరిగి ఇంటికి చేరుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.