నీళ్లు.. నిధులు.. నియామకాలు.. అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్.. జంగల్.. జమీన్… అనే కుమురం భీం కలలను కూడా.. అక్షరాలా.. సాకారం చేసిన.. ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. మొన్న కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన “జల్” అందించారని.. నిన్న కంటికి రెప్పలా కాపాడటంతో.. రాష్ట్రంలో 7.70 శాతం “జంగల్” పెరిగిందని.. నేడు 1.51 లక్షల మందికి ఏకంగా 4.60 లక్షల ఎకరాల “జమీన్” అందిస్తున్నారని ట్వీట్ చేశారు.
” మావ నాటే – మావ రాజ్ ” స్వప్నం గ్రామ పంచాయితీల ఏర్పాటుతో సాకారం చేశారని తెలిపారు. పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆకాశాన్నంటే ఆత్మ విశ్వాసం నింపారని పేర్కొన్నారు. ఇలా ఒకటా.. రెండా… పోడు భూముల గోడు తీర్చి.. గిరిజన ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చి.. పట్టాలతో.. పట్టాభిషేకం చేస్తున్న తరుణం ఇది అని ట్విటర్ వేదికగా కేటీఆర్ తెలిపారు. అడవిబిడ్డల అభ్యున్నతిలోనే ఓ సువర్ణ అధ్యాయం పోడు పట్టాల పంపిణీ అని కేటీఆర్ అభివర్ణించారు.
నీళ్ళు..
నిధులు..
నియామకాలు..
అనే ఉద్యమ నినాదాలనే కాదు..జల్..
జంగల్..
జమీన్…
అనే కుమ్రం భీం కలలను కూడా..అక్షరాలా..
సాకారం చేసిన..
ధీరోదాత్తమైన నాయకుడు..
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు…మొన్న
కొండకోనల్లోని నివాసాలకు
మిషన్ భగీరథతో స్వచ్ఛమైన "జల్"నిన్న
కంటికి రెప్పలా… pic.twitter.com/WZOZQrTDUf— KTR (@KTRBRS) June 30, 2023