దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. హరితహారం : కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హరితోత్సవాన్ని పురస్కరించుకుని ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం హరితహారం అని అభివర్ణించారు. మహోద్యమంలాగా తెలంగాణ హరితహారం కొనసాగుతోందని తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటాలన్న సమున్నత సంకల్పం ప్రపంచ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం అని వెల్లడించారు. 33 శాతం గ్రీన్ కవర్ ఆశయం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

“తెలంగాణ పునర్నిర్మాణం అంటే… ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం.. సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్. “వానలు వాపసు రావాలె.. కోతులు వాపసు పోవాలె..” అన్న మహోన్నత లక్ష్యం నెరవేరుతోంది. ప్రతి పల్లె పచ్చదనంతో మురిసిపోతోంది. ప్రతి పట్నంలో హరిత శోభ వెల్లివిరుస్తోంది. ఆగమైన అడవి చుట్టూ పచ్చని పందిరి అల్లుకుంటోంది. ” అని కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news