హత్యకి గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. బాగ్ అంబర్‌పేట్ లో హత్యకి గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇక అటు తెలంగాణలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతుల, కార్మికులు, మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే ఉన్నారని రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహించారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచడం ఏంటి.. ఇంత అన్యాయం ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి? అంటూ నిలదీశారు.