KTR visited the Ram Temple in Kukatpally : శ్రీరామ నవమి సందర్భంగా కూకట్‌పల్లిలోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించి, వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లిలోని రామాలయంను కేటీఆర్ దర్శించుకున్న నేపథ్యంలో…జనాలు ఎగబడ్డారు. కేటీఆర్ రాకతో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తారు భక్త జనం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

కాగా..ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు చెప్పారు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోందని తెలిపారు.