తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహమా..కాంగ్రెస్ కు శిక్ష తప్పదు ? అని హెచ్చరించారు కేటీఆర్. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణ తల్లిని అవమానిస్తారా ? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ? అని రెచ్చిపోయారు. తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ? తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ? అని మండిపడ్డారు కేటీఆర్.
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ? అని చురకలు అంటించారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ? అంటూ ఆగ్రహించారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట.. “రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ?? తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.