తిరుపతిలో దారుణం జరిగింది. రూప్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి తెలియకుండా రూ.13.8 లక్షలు లోన్ తీసుకుని కాజేశారు సైబర్ క్రైమ్ నేరగాళ్లు. తిరుపతి విద్యానగర్ కు చెందిన రూప్ కుమార్ కు 5వ తేదిన ముంబై కు చెందిన నకిలీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు. ఇరాన్ కు ఇల్లీగల్ వస్తువులు సరఫరా చేశారంటూ రూప్ కుమార్ ను బెదిరించారట నకిలీ సైబర్ క్రైమ్ పోలీసులు.
విచారణ కోసం ముంబైకు రావాలని రూప్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారట. లేకపోతే స్కైప్ యాప్ లో మాట్లాడాలని బెదిరింపులకు దిగారట. రూప్ కుమార్ అకౌంట్ వివరాలు, ఒటిపి లు తీసుకున్నారట నకిలీ సైబర్ క్రైమ్ పోలీసులు. బాధితుని కి తెలియకుండా వచ్చిన లోన్ అమౌంట్ కాజేశారట సైబర్ కేటుగాళ్లు. ఇక లోన్ తీసుకున్నట్లు బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో మోసపోయానని తెలుసుకున్నారట రూప్ కుమార్. అనంతరం ఎస్పీ సుబ్బారాయుడు కు ఫిర్యాదు చేశాడు బాధితుడు రూప్ కుమార్. దీంతో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ నమోదు అయింది.