మోడీ జీ ఆర్ఆర్ టాక్స్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? : కేటీఆర్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రధాని మోడీ.. ‘ఆర్ఆర్ ట్యాక్స్ మీద మాట్లాడి నాలుగు నెలలు దాటింది. ఇప్పటివరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తోందని మీరు అంటారు. మీ సహచరులు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాత్రం నోరెత్తరు.వారు మీతో ఏకీభవించరా? లేక మీ విమర్శ ఎన్నికల స్టంటా?’ అని ప్రశ్నించారు.

ktr

కాగా, అమెరికా పర్యటన నుంచి ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉంది. నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news