రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కేటీఆర్ భూపాలపల్లికి చేరుకొని… నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. 15 ఎకరాల విస్తీర్ణంలో… 59 కోట్ల 45 లక్షల వ్యయంతో.. సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో.. జిల్లా పాలనా సౌధాన్ని నిర్మించారు. అనంతరం 25కోట్ల 90లక్షల రూపాయలతో 37ఎకరాల్లో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. పట్టణంలో నిర్మించిన 416 రెండు పడకల గదులను లబ్ధిదారులకు అందజేస్తారు.
హనుమకొండ జిల్లా పరకాలలో 4కోట్ల 85లక్షలతో నిర్మించిన మునిసిపాలిటీ భవనం, 2కోట్ల 15లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, 2కోట్ల 80లక్షల రూపాయతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభిస్తారు. మరో 114 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా కేటీఆర్ శంకుస్ధాపన చేస్తారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 25కోట్ల రూపాయల మేర పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తొర్రూరు పర్యటన ముగించుకుని.. జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకుంటారు. అక్కడ మినీ టెక్స్ టైల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలతోపాటు భూపాలపల్లి, పరకాల, తొర్రూరులో జరిగే బహిరంగసభల్లో….. మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.