గుడ్​న్యూస్.. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్‌ హెల్త్ కేర్ ట్రస్ట్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముంగిట ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్‌ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూత‌న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ అమ‌లుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీమ్​తో ఉద్యోగులు, పింఛనర్లతో పాటు కుటుంబస‌భ్యుల‌కు ప్రయోజనం దక్కనుంది. ఈ పథకం నిర్వహ‌ణ‌కు సీఎస్ నేతృత్వంలో బోర్డు ఏర్పాటు చేయాలని.. స‌భ్యులుగా అధికారులు, ఉద్యోగులు, పింఛనర్లుగా ఉండాలని కేసీఆర్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

జీవో నం. 186 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల భాగస్వామ్యంతో ఈహెచ్ఎస్ పథకం రూపొందించాలని నిర్ణయించింది. బిస్వాల్ కమిటీ సిఫారసుల మేరకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని… తొలి పీఆర్సీ ఇచ్చిన నివేదిక మేరకు సర్కార్‌ ఈ చర్యలు చేపట్టింది. ప‌థ‌కం ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని సేకరిస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్‌ జ‌మ చేస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు విధివిధానాలను ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news