తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్‌పై సంతకం చేస్తారన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై KTR స్పందించారు. ‘చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకి చాలా అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ‘కమీషన్ సర్కార్’ నడుస్తోంది.

ఈ 30 శాతం కమీషన్ ప్రభుత్వంలో.. కమీషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకాలు పెట్టరని చెబుతున్నారు. మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలి.’ అని KTR ట్వీట్ చేశారు.ఇక అటు మంత్రులు డబ్బులు తీసుకోవడం పై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. నేను మాట్లాడింది గత ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి అంటూ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. గతంలో ఏ పని చేయడానికైనా మంత్రులు డబ్బులు తీసుకునే వారని నేను మాట్లాడాను… నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు.