ఆ మూడు మెట్రో మాల్స్ ను లీజుకిచ్చిన ఎల్‌&టీ సంస్థ

-

హైదరాబాద్లో ప్రముఖ ఎల్‌అండ్‌టీ సంస్థ ‘హైదరాబాద్‌ నెక్స్ట్‌ గల్లేరియా’ పేరుతో పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌ సిటీలోని ప్రభుత్వ భూముల్లో మూడు మాల్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూడు మాల్స్ చేతులు మారాయి. లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు ‘నెక్సస్‌ సెలెక్ట్‌’కు ఎల్ అండ్ టీ సంస్థ లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల ముంబయిలో రూ.3 వేల కోట్లతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మూడు మాల్స్‌ 12 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉండగా.. గత ఆగస్టులో రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని, అక్కడే నిర్మించిన కార్యాలయ   భవనాన్ని కలిపి రాఫర్టీ సంస్థకు సబ్‌ లైసెన్సు ఇచ్చింది. ఒప్పందం విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ రెండు లావాదేవీల ద్వారా ఎల్‌అండ్‌టీ మెట్రోకు మొత్తం రూ.4 వేల కోట్ల వరకు సమకూరనున్నట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మెట్రో రూ.4 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ సబ్‌ లైసెన్సుల ద్వారా వాటి నుంచి గట్టెక్కాలనే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news