లేక్ ఫ్రంట్ పార్కు హైదరాబాద్‌కు సరికొత్త అందం : మంత్రి కేటీఆర్

-

లేక్ ఫ్రంట్ పార్కు హైదరాబాద్‌కు సరికొత్త అందం అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. సెంట్రల్ హైదరాబాద్ కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్కును HMDA అభివృద్ధి చేసింది.

Lake Front Park is a new beauty for Hyderabad said Minister KTR

మరికొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రారంభించనున్నాం. మీరందరూ అందమైన బోర్డు వాక్ ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, విభజనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలను పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించమన్నారు. ఆనాడో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశారు. ఇప్పుడు తెలంగాణ పుట్టకనే అవమానించిన బీజేపీకి.. ఇక్కడ పుట్టగతులుండవు అని పేర్కొన్నారు.

https://x.com/KTRBRS/status/1703971587807129722?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version