స్వర్గీయ నందమూరి తారకరామా రావు 101వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మి పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో నేషనల్ ఫ్రంట్ స్థాపించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుంది అని అన్నారు. అలాంటి మహనీయుడికి భార్యను అవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
మనిషి పుట్టుక తరువాతే మరణం ఉంటుందన్న లక్ష్మీ పార్వతి.. – ఎన్టీఆర్ మరణించినా ప్రజల మనస్సులో బతికే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత ఆయన ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో మంచి పాలన జరగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ప్రజల కోసం జీవించిన నాయకులని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. మరోవైపు జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్న లక్ష్మీ పార్వతి.. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ ఏపీ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని వ్యాఖ్యానించారు.