BREAKING : బిజెపి కార్యాలయాన్ని ముట్టడించిన లంబాడీలు

-

BREAKING : బిజెపి కార్యాలయాన్ని ముట్టడించారు లంబాడీలు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలిగించాలని బిజెపి ఎంపీ సోయం బాబు రావు వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…. నాంపల్లిలోని బిజెపి కార్యాలయాన్ని ముట్టడించారు తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు.

బీజేపీ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ తరునంలోనే.. పోలీసులకు జేఏసీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోయం బాబూరావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి, బీజేపీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లంబాడీలు. ఇక అటు లంబాడీ జేఏసీ నాయకులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news