గోనె సంచిలో మూడు ముక్కలుగా డెడ్ బాడీ.. అసలు విషయం తెలుసుకుని పోలీసులు షాక్

-

హైదరాబాద్​లోని లంగర్​హౌస్ మిలటరీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కాలిబాటపై ఉన్న గోనె సంచిలో వ్యక్తి మృతదేహాన్ని లంగర్‌హౌస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి 10:45 గంటల సమయంలో కాలిబాటపై ఉన్న సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సంచిని తెరిచి చూడగా అందులో ముక్కలు ముక్కలుగా నరికి ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది.

వాటిని శవపరీక్ష కోసం ఉస్మానియా శవాగారానికి తరలించారు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంచిని ఇక్కడ పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లంగర్‌హౌస్‌ టిప్పుఖాన్‌ బ్రిడ్జి వైపు నుంచి ఈ ఆటో వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. బండ్లగూడ నుంచి సంఘటనా స్థలం వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఎట్టకేలకు ఈ ఘటనను ఛేదించిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. మృతుడు ఎన్‌ఎఫ్‌ఎస్ఎల్ కాలనీకి చెందిన అశోక్‌గా గుర్తించారు. అశోక్ క్యాన్సర్‌తో మృతిచెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అతడి సోదరి, సోదరుడు అశోక్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనెసంచిలో పెట్టి మిలటరీ ఆసుపత్రి వద్ద పడేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version