బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయున పడవ అని.. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగా నే పోటీ చేస్తుందని ప్రకటించారు.
నేటితో బిజేపి జాతీయ సమావేశాలు ముగియనున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో “భారత మండపం” వేదికగా బిజేపి జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ…బిఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం… బిజేపితో పొత్తులంటూ బిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందని ఫైర్ అయ్యారు డా. లక్ష్మణ్. బతికి బట్టకట్టడానికి బిఆర్ఎస్ ఆడుతున్న నాటకమని..మునగపోయే పడవ కాంగ్రెస్ పార్టీ అంటూ చురకల అంటించారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శలు చేశారు డా. లక్ష్మణ్. తెలంగాణ లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బిజేపి ల మధ్యే పోటీ అన్నారు. తెలంగాణ లో బిజేపి దే భవిష్యత్తు అని తెలిపారు డా. లక్ష్మణ్.