7 కి.మీ.లు.. 6 స్టేషన్లతో ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మెట్రో

-

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు రెండో దశకు రంగం సిద్ధం అవుతోంది. రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండనున్న ఈ మార్గంలో సగటున కిలోమీటరుకు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్‌ను ప్రతిపాదించారు. రహదారికి ఎటువైపు ఉన్నా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపకల్పనకు జాతీయ  రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు తుదిరూపు ఇచ్చారు.

మెట్రోరైలు రెండోదశలో వేర్వేరు మార్గాల్లో 70 కి.మీ. నిర్మాణాన్ని ప్రతిపాదించగా.. డీపీఆర్‌ పనులు  జరుగుతున్నాయి. ఇందులో ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మార్గం ఒకటి. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఉన్న కారిడార్‌-1కి పొడిగింపు ఇది. ఈ మార్గంలో చింతల్‌కుంట వద్ద ఒక స్టేషన్‌ రానుంది.  మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. చింతల్‌కుంట నుంచి హయత్‌నగర్‌ మధ్య జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ కారణంగా ఎడమవైపు సర్వీస్‌ రోడ్డులో మెట్రోరైలు మార్గం రానుందని మెట్రో అధికారులు  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news