తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా.. సంక్షేమ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషిని ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు కులవృత్తులకు ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సాయాన్ని ఇవాళ లబ్ధిదారులకు అందజేస్తున్నారు.
రోజుకో శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 11న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాహితీ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలుగు, ఉర్దూ రెండు భాషల్లో వచనం, పద్యం, కవిత్వం విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో మొదటి ఐదు రచనలుకు నగదు బహుమతి అందచేస్తున్నుట్టు చెప్పారు. ఒకనాడు రాష్ట్రంలో కవులే లేరనే.. అవమానాలు ఎదుర్కున్నామని కాని ఇప్పుడు ఆపరిస్థితి లేదని కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం వల్ల వారిలో పోటితత్వం పెరిగి మరింత ఆదరణ పెరుగుతుందని తెలిపారు