హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

-

హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. యూకేకు చెందిన ప్రతిష్ఠాత్మక బ్యాంకింగ్‌ గ్రూప్‌ ‘లాయిడ్స్‌’ భారీ పెట్టుబడితో తమ సాంకేతిక కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. గత నెలలో యూకే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ జరిగిన ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్‌ సంస్థ నిర్ణయం తీసుకుంది.

వ్యాపార అనుకూలతలు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నట్లు లాయిడ్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాన్‌ వాన్‌ కెమెనడే తెలిపారు. ఇందుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

‘‘హైదరాబాద్‌లో లాయిడ్స్‌ బ్యాంక్‌ తమ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం హర్షణీయం. యూకేలో కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశమయ్యాం. వారు అనతికాలంలోనే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషం కలిగిస్తోంది. సుమారు 600 మంది సైబర్‌ స్పెషలిస్టులను తొలి ఆరు నెలల్లో ఉద్యోగాల్లోకి తీసుకోనుంది. దశల వారీగా ఈ సంఖ్యను పెంచుతుంది.’’ అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news