ఎన్నికల తర్వాత ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటౌవుతాయి – విజయశాంతి

-

 

ఎన్నికల తర్వాత ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటౌవుతాయంటూ సంచలన వ్యాక్యలు చేశారు విజయశాంతి. ఎంఐఎం, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లు ఎన్నికల అనంతరం ఒక్కటి ఎట్లా?… అని కొందరు ప్రశ్నిస్తున్నారని… 45 బీఆర్ఎస్, 45 కాంగ్రెస్, 7 ఎంఐఎం అని పీసీసీ సర్వే,… మిగతా చోట్ల హోరాహోరీ (అంటే, అవాస్తవ సర్వేలో కూడా మేము సందేహం…) అని కాంగ్రెస్ చెప్తున్నప్పుడు ఆ మూడు సయామీ ట్విన్స్, లేదా కనీసం ఇద్దరు సయామీ ట్విన్స్ అయినా కలవక సర్కార్ ఎట్లయితది? అంటూ ప్రశ్నించారు. సైద్దాంతిక సారూప్యత కలవక తప్పని స్ధితి కలిపిస్తది.

 

కాబట్టి బీఆర్ఎస్ వద్దు అనేటోల్లు, కాంగ్రెస్‌కు ఓటు వేసినా… కాంగ్రెస్ పడనోల్లు బీఆర్ఎస్‌కు వేసినా… ఇంకా ఎంఐఎంను కొన్ని సీట్లలో గెలిపించినా ఒకటే, అంతా ఒక్కటే భవిష్యత్తు అన్నారు. సరే, తెలంగాణ ఎన్నికలకు భారతీయ జనతా ఒక్కటి ఒకవైపు, బయటకు చెప్పని పై మూడు పార్టీల ఒప్పంద కూటమి మరో వైపు అంటూ వ్యాఖ్యానించారు. మన ఉద్యమకారులకు జన్మంతా పోరాటమే.. ఇది మరో యుద్ధం, అంతే… గెలుపు మనది… బీజేపీది అంతేనన్నారు.. ఎందుకంటే సంపన్న తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పుకి దిగజార్చిన బీఆర్ఎస్ నుండి మనం కొట్లాడి తెచ్చుకున్న మన
రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సిన కర్తవ్యం మనకుందని వెల్లడించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news