ఆస్తులు కాపాడుకోడానికే… కాంగ్రెస్ లోకి 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు – మధుయాష్కీ గౌడ్

-

కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోడానికి వస్తున్నారని బాంబ్‌ పేల్చారు మధుయాష్కీ గౌడ్. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో గంగారెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ లక్ష్మణ్ తో కలిసి పరామర్శించారు మధుయాష్కి. అనంతరం మధుయాష్కీ మాట్లాడుతూ… గంగారెడ్డి అతి దారుణంగా హత్యకి‌ గురికావడం ‌బాధకరమన్నారు.

Madhuyashki visited Gangareddy’s family along with MLC Jeevan Reddy and Whip Laxman

కాంగ్రెస్ పార్టీని నమ్ముకొన్న వ్యక్తి గంగారెడ్డి అని… తనకి ప్రాణహాని ఉందని పోలీసులకి చెప్పుకున్నారని వెల్లడించారు. ప్రాణానికి ముప్పు ఉందని చెప్పిన పోలిసులు ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో‌ కాంగ్రెస్ నాయకులు హత్య‌ గురి కావడం బాధకరం అన్నారు. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలిసులు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాల్సిన అవసరం మాపై ఉందని తెలిపారు. 2014 లో ఉమ్మడి ‌జిల్లా నుండి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారని…బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు‌ పెట్టిన బీఆర్ఎస్ లోకి వెళ్ళలేదని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news