తెలంగాణలో RUB (రబ్) టాక్స్ వసూల్ చేస్తున్నారు – మహేశ్వర్‌రెడ్డి

-

తెలంగాణలో RUB (రబ్) టాక్స్ వసూల్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి. సివిల్ సప్లై శాఖ లో జరుగుతున్న అవినీతినీ బయట పెట్టాను…నేను ఆడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆగ్రహించారు. బాధ్యతయుతమైన మంత్రి మొఖం చాటేస్తున్నారని… ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ రాస్తున్నానని వెల్లడించారు.

BJP MLA Eleti Maheshwar Reddy on krmb

18 ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని కోరుతున్నా… సివిల్ సప్లై అవకతవకలు పై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి. సీబీఐ కి పిర్యాదు చేస్తా…ధాన్యం సేకరణ లో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని వెల్లడించారు. కేంద్రానికి పిర్యాదు చేస్తా… సీబీఐ దర్యాప్తు చేయిస్తానని హెచ్చరించారు. మీరు నా మీద కేసులు పెట్టడం కాదు….RUB (రబ్) టాక్స్ వసూల్ చేస్తున్నారని ఆగ్రహించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news