మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేటలో BRS కౌన్సిలర్ పై కాంగ్రెస్ కార్యకర్త పెట్రోల్ దాడి జరిగింది. పెట్రోల్ పోసి BRS కౌన్సిలర్ నాగరాజు ని నిప్పటించే ప్రయత్నం చేశాడు కాంగ్రెస్ కార్యకర్త గణేష్. పెట్రోల్ దాడికి భూ తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే కారణమని అనుమానం అని పోలీసులు చెబుతున్నారు.
అయితే.. ఈ ఘటనపై X లో మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. పెట్రో దాడిని ఖండించిన హరీష్ రావు….కాంగ్రెస్ హయాంలో నిత్యం బెదిరింపులు, హత్యారాజకీయాలు అవుతున్నాయని ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతుకలైన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులతో నిలువరించలేరన్నారు హరీశ్ రావు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.