కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – మహేశ్వర్ రెడ్డి సవాల్

-

కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుచు కుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేదంటే నువ్వు తప్పుకుంటావా అంటూ రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్‌ చేశారు. బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష నిర్మల్ జిల్లా కేంద్రం దగ్గర మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయాలపై ఉన్న ప్రేమ, రైతులపై లేదన్నారు.

Maheshwar Reddy challenges cm Revanth Reddy

సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయి….ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.. సాగు నీరు, విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని ఫైర్‌ అయ్యారు.
ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని.. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆగ్రహించారు.

రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదు….పంటకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని నిలదీశారు. రూ. 15000 రైతు భరోసా సాయం ఇవ్వలేదు….కౌలు రైతులకు రూ. 12000 సాయం ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు పంటలు ఎండిపోతే పరిహారం ఇచ్చే దిక్కు లేదు….వెంటనే పంట నష్టపోయిన రైతులకు సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version