కాంగ్రెస్ పార్టీలోకి BRS వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. BRS మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరి రాకను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.
దీంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి త్వరలో అన్ని అడ్డంకులను క్లియర్ చేసి మామా అల్లుళ్లను కాంగ్రెస్‌లోకి తెస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపుగా ఖాయమైందని, వారం రోజుల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ను వీడతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని సంప్రదించగా… ‘‘పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్యకర్తల అభిప్రాయం తీసుకుని చేరికపై నిర్ణయం తీసుకుంటా’’ అని ఆయన చెప్పుకొచ్చారు.