త్వరలో రేవంత్ రెడ్డి కూడా బిజెపిలో చేరతారు – తెలంగాణ మంత్రి

-

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే బిజెపిలో చేరిపోతానంటూ రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బీజేపీలోకి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే కలిసిపోయాయని ఆరోపించిన మల్లారెడ్డి, ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతూ కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

బిజెపికి కార్యకర్తలు లేక బహిరంగ సభలకు కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. షామీర్ పేట మండల కేంద్రంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బీజేపీలోకి పంపి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా బిజెపిలో చేరతానంటూ వ్యాఖ్యలు చేశారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైన మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కాంగ్రెస్ ఇప్పటికే దివాలా తీసింది అని ఎద్దేవా చేశారు. బిజెపి కూడా ఫెయిల్ అయిందని, అందుకే అమిత్ షా, జె.పి.నడ్డా సభలకు కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారని వ్యంగ్యంగా విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version