సచిన్ కూతురుకు షాక్…సారా అలీ ఖాన్ తో గిల్ డేటింగ్..?

-

కొన్నేళ్లుగా సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో, శుబ్ మాన్ గిల్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. శుబ్ మాన్ గిల్ మంచి ప్రదర్శన ఇచ్చిన ప్రతిసారి వీరిద్దరి మధ్య తంతు నడుస్తుందని పోస్టులు రావడం, సారా హ్యాపీగా ఫీల్ అవుతుందనే కామెంట్లు మీమ్స్, తదితర క్యాప్షన్లు పుంకాలు పుంకాలుగా నెట్టింట ట్రెండ్ అయ్యేవి. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరోసారి శుబ్ మన్ గిల్ పేరు నెట్టింట మారు మోగిపోతుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంగ్లాండులో కౌంటీ క్రికెట్ ఆడేందుకు గిల్ వెళ్ళగా, అక్కడ సారా తో కలిసి ఉన్న ఫోటో లీకవ్వడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే వీరిద్దరూ యాదృచ్ఛికంగా కలిశారా? లేదా మరి ఏదైనా ఉందనే విషయం తెలియరాలేదు.

ఈ ఫోటోపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే క్లారిటీ వస్తుంది. కాగా గతంలో సారా టెండూల్కర్ తో శుబ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలకు ఒకరు కామెంట్స్ పెట్టుకునేవారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version