కోర్టు బిల్డింగ్ నుంచి దూకి వ్యక్తి ఆత్మాహత్యాయత్నం..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కొందరూ వ్యక్తులు క్షణిక ఆవేశంలో ఆగ్రహానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నారు. అందులో కొందరూ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరికొందరూ చావు అంచుల వరకు వెళ్లి వస్తున్నారు. ఇలా కారణాలు ఏవైనా ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోతున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు వద్ద భవనంపై నుంచి దూకి మహ్మద్ సలీముద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మెహిదీపట్నంలోని ఫస్ట్ ల్యాన్సర్ ప్రాంతానికి చెందిన సలీముద్దీన్ గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇవాళ కోర్టులో పేషీ ఉండటంతో నాంపల్లి కోర్టుకు హాజరు అయ్యాడు. ఈ నేపథ్యంలో కోర్టు భవనం మూడవ అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సలీముద్దీన్ ను ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు. అయితే సలీముద్దీన్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.