ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం సహజం. కానీ ఒకేసారి రెండు వివాహాలు.. అదేనండి ఒకేసారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం మాత్రం కాస్త డిఫరెంటుగా అనిపిస్తోంది కదూ. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. కానీ ఓ యువకుడు ఒకే మండపంలో ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడాడు. అది కూడా పెద్దల సాక్షిగా.. బంధువుల సమక్షంలో. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్మూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సూర్యదేవ్ అనే యువకుడు ఈ ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. అయితే అతడు వారిలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆ యువతులు కూడా అతడే కావాలని పట్టుబడ్డారు. చేసేదేం లేక ముగ్గురూ కలిసి జీవించాలనే నిర్ణయానికి వచ్చారు. మొదట ఈ నిర్ణయం విన్న వారి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కానీ వారు పట్టిన పట్టు వదలకపోవడంతో ముగ్గురికి ఒకే మండపంలో పెళ్లి చేశారు.
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న… pic.twitter.com/Tbre507zTB
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025