రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా?.. కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా?- మందకృష్ణ

-

కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై మందకృష్ణ మాదిగ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా?.. కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా? అంటూ ఫైర్‌ అయ్యారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయకుండా వస్తున్న ఎమ్మెల్యేలను ఎలా పార్టీలో చేర్చుకుంటున్నావు అంటూ నిలదీశారు మందకృష్ణ మాదిగ.

manda krishna madiga slams kadiyam srihari

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీలో చక్రం తిప్పుతున్న కొప్పుల రాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్లందరూ మాల సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు మందకృష్ణ మాదిగ. కడియం శ్రీహరి సిగ్గులేనోడన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏండ్ల వయసులో పార్టీ మారడం ఏంటి సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పుడు అదే 75 ఏండ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఆ సిగ్గులేనోడిని ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నాడని ఆగ్రహించారు మందకృష్ణ మాదిగ.

Read more RELATED
Recommended to you

Latest news