ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు చర్చ నడుస్తోంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కమ్మ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో… ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు చర్చ నడుస్తోంది.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ సన్నిహితుడు మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం అందుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినికి ఇవ్వకుండా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుండా చెక్ పెట్టేందుకు స్థానికేతరుని రంగంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం అందుతోంది. మండవకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నన్నట్లేనని ఖమ్మం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కాంగ్రెస్… ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో చూడాలి.