సీఎం జగన్ పై కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహరాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా గిరిజన గ్రామాల్లో వరుస మరణాలపై కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహరాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ విమర్శలు చేశారు. గత 15 రోజులుగా విజయనగరంలో వైద్యం అందక ముగ్గురు చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఏపీలో చాలా పేద కుటుంబాలు నిస్సహయంగా ఉన్నాయి….ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అంటూ సీఎం జగన్ వాటికే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.
వైఎస్ పాలన అయితే ఇలా ఉంటుందా..? అంటూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల నేటి నుంచి 31 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో, మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి విజయనగరంలో ఆ జిల్లాపై రివ్యూ చేస్తారు. రోజు 3 నుంచి 4 జిల్లాల చొప్పున పర్యటిస్తూ సమీక్ష నిర్వహించనున్నారు.