మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

-

మావోయిస్ట్ అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి.. శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిని మావోయిస్ట్ పార్టీ మాత్రం దృవీకరించలేదు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండటం గమనార్హం.

 రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రుల పల్లి. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. రాజిరెడ్డిని పట్టుకుంటే రూ.కోటి కూడా ప్రభుత్వం నజరానా ప్రకటించడం విశేషం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాలలో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణలో రాజిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు, గుజరాత్ లతో కూడి మావోయిస్టుల రైతు ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్ ఛార్జిగా కూడా పని చేశారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్ పాండే, సత్తెన్న, పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news