బెల్లంపల్లి ఎమ్మెల్యేపై మావోయిస్టుల లేఖ..!

-

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేసారు. మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట లేఖ వచ్చింది. ఎమ్మెల్యే కు వార్నింగ్ ఇస్తూ ఈ లేఖ వచ్చింది. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి ఆరాటం, జల్సాల కోసం విహారం చేస్తున్నాడంటూ లేఖలో ఆరోపించారు. రౌడీలను, భూ కబ్జాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రోత్సహిస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు మావోలు.

ఇంటి నంబర్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే అనుచరులు మోసం చేశారు అని లేఖలో ప్రస్తావించిన మావోయిస్టులు… బెల్లంప‌ల్లి లో సింగ‌రేణి విద్యుత్ క‌ట్ చేయ‌డంతో కార్మికులు, రిటైర్డ్ కార్మికులు గత నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు అని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే వినోద్ తన పద్ధతి వెంటె మార్చుకొని ప్రజల సమస్యలు పట్టించుకోవాలని హెచ్చరిస్తూ ఈ లేఖ ఉంది. దాంతో ప్రస్తుతం ఈ మావోల లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version