తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ‘తెలంగాణలో నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.
ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలకు నిధులు ఎలా సమకూర్చుతారు? నిత్యాసరాల ధరలు, పన్నులు పెంచితే ప్రజలు సహించరు’ అంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. మరి దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
కాగా, తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తన టీమ్ ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో అనుభవజ్ఞులకు పట్టం కట్టిన రేవంత్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటు ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించే నియామకాల పైన కూడా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు.