మల్కాజిగిరి సమస్యలు పరిష్కరిస్తా..ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరారు బీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో బీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మల్కాజిగిరి ఉందని..క్యాడర్ అయోమయంలో ఉంది…కార్యకర్తలకు భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మల్కాజిగిరికి ఎంతో అభివృద్ధి చేశారు….ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు.
కార్యకర్తలు అయోమయంకు గురి కావద్దని… మహేంద్ర హిల్స్ లో రియర్వాయర్ కట్టాలని తెలిపారు. చెరువుల వల్ల కాలనీలు ముంపునకు గురౌతున్నాయని వివరించారు. డ్రైనేజీ పనులు కూడా చేయాల్సి ఉందని..మల్కాజిగిరి ఎంపీగా స్వల్ప తేడాతో ఓడిపోయానన్నారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి… సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దుండిగల్ లో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నాం…కేసీఆర్ శ్రీరామరక్ష.. ఆయన ఉన్నన్ని రోజులు ఎవరికి ఏమి కాదని వివరించారు.