రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా ఠాగూర్‌ మారారు – శశిధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొమ్ములాటలు కొత్తేమీ కాదు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి… ఈ కుమ్ములాటలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని దోషిగా చూపించి పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి, బిజెపిలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నియంతల వ్యవహరిస్తున్నారని కొంతమంది అసంతృప్తి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా ఠాగూర్‌ మారారని ఫైర్ అయ్యారు శశిధర్‌రెడ్డి. సీనియర్లను గోడకేసి కొడతానన్నా.. అధిష్టానం మందలించలేదు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ విషయంలో రేవంత్‌ తీరు సరికాదని విమర్శలు చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు శశిధర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version