కాసేపట్లో పెళ్లి.. అంతలోనే అక్క భర్తతో వెళ్లిపోయిన పెళ్లికూతురు

-

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. జీవితాంతం పెళ్లి చేసుకున్న వ్యక్తితోనే.. ఉండేందుకు వేసే మూడుముళ్ల బంధమే పెళ్లి. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లి విషయంలో చాలా వింతలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ కావడం, లేక పెళ్లి తర్వాత వేరే వ్యక్తితో లేచిపోవడం, లేచిపోయి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఇలా కోకోల్లోలు మన ఇండియాలో చోటు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నాపూర్ కు చెందిన యువతకి, లంబాడి పల్లికి చెందిన అబ్బాయితో ఆదివారం పెళ్లి కావాల్సి ఉంది. అయితే కాసేపట్లో పెళ్లి ఉండగా పెళ్లికూతురు అందరికీ షాక్ ఇచ్చింది. తన అక్క భర్త ఆయన బావతో లేచిపోయింది. దీంతో ఆమె కోసం ఎంతగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version