గత వారం మే 5వ తేదీన పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజీలాండ్ తో నాలుగవ వన్ డే ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కివీస్ పై 102 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తో వరుసగా నాలుగు మ్యాచ్ లను గెలుచుకున్న బాబర్ సేన ఐసీసీ వన్ డే వరల్డ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా చరిత్రలో నెంబర్ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే.. ఈ ఆనందం పాకిస్తాన్ కు ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా 48 గంటలు కూడా ముగియకముందే పాకిస్తాన్ ఏకంగా మూడవ ర్యాంక్ కు పడిపోయింది.
షాకింగ్: 48 గంటలు తిరక్కుండానే నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయిన పాకిస్తాన్ !
-